నిత్య అవసరాలకు సాధారణ జీవనశైలికి, అభివృద్దికి, విద్యుత్ కీలకమైనది. వినియోగదారులందరు నిరంతర, నాణ్యమైన విద్యుత్ ను కోరుకుంటారు.
ప్రాధమిక ఆరోగ్య పరిరక్షణకు, వ్యవసాయమునకు, పరిశ్రమలకు, వాణిజ్యమునకు, గృహములకు, విధ్యాబోధనకు, కమ్యునికేషన్ కు, రవాణా సౌకర్యములకు, విద్యుత్ అవసరము.
సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి, గ్రామ స్థాయి నుండి పునాది అవసరము. వ్యాధి నిరోధక సూత్రాలు, విద్య వలన ప్రయోజనాలు, జల, విద్యుత్,పొదుపు విధానాలు, నాణ్యమైన నిర్మాణాల వలన ప్రజా ప్రయోజనాలు, పౌర సరఫరా, పంపిణి విధి విధానాలు, లోటు పాట్లను, వివరించి తెలియజేయు ప్రజా పరిశీలక సంఘాల వలన, దేశ అభివృద్ది మెరుగు పడడానికి రాజబాట.
కొంచెం శ్రద్ధ కూడ పెద్ద సమస్యలను నిలువరించే దానికి వీలు కలుగుతుంది. గ్రామాల్లో ఆరొగ్య, విద్యుత్, విద్య, వ్యవసాయము, నీటి వనరులను పొదుపు అంశాలపై చైతన్య వంతులు చేయడానికి, మండల యంత్రాంగము ప్రతి రెండవ శని వారము, ఆది వారము, ఏదొ ఒక గ్రామము ఎంచుకొని సమస్య, పరిష్కార సమీక్షలు, ప్రజా పరిశీలనలోకి తీసుకొనిరావడము సంఘాల సమన్వయముతో చేసిన, గ్రామ అభివృద్దికి, కారణమవుతుంది. అయితే ఇది ఆచరణ యోగ్యము పరచడానికి కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పని. యూనివర్సిటిలో ప్రాజెక్ట్ చేయు యువతి, యువకులకు లేక గ్రామ, కాలని, పట్టణ, యువతి, యువకులకు 5 గురికి తక్కువ కాకుండా సంబంధిత అధికార యంత్రాంగము ద్వారా ఎంపిక చేసి, సరియైన ప్రొత్సాహకము, భృతి ఇచ్చి, ఎన్నిక కాబడిన గ్రామ/కాలని/పట్టణములలో, ఆరొగ్య, విద్య, వ్యవసాయము మౌలిక సదుపాయములు, విద్యుత్ సరఫరా లోటు, పాట్లను, మంచి నీరు, గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, వినియోగదారులను చైతన్య పరిచి, గ్రామాభివృద్ది, దేశ, దిశ, నిర్ణయాలను క్షేత్ర స్థాయి అధికారులకు ప్రతి నెల తెలియ పరుస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్త పరుస్తున్న యడల అభివృద్దికి అదే రాజ బాట.నిరుద్యోగ సమస్యలు, అసంత్రుప్తి తగ్గే అవకాశమున్నది.