Feeds:
టపాలు
వ్యాఖ్యలు

న్యాయ సేవలు

జాతీయ స్థాయిలో ఉచిత న్యాయ సేవలుపొందడానికి ఈక్రింది వారిని సంప్రతించండి
స్టేట్ లీగల్ అథారిటి
న్యాయసేవసదన్
పురాని హవేలి
హైదరాబాద్ 500002 టెల్ 040 23446701

1)vidyut samasyalu
2)penshan samasyalu
3)kaarmikula nasTaparihaaramu
4)bhu seakarana keasulu

ప్రకటనలు

శుభా కాంక్షలు

వినియోగదారులకు దీపావళి శుభాకాంక్షలు

దగ్గరలో వున్న విద్యుత్ సేవా కేంద్రములో/పై అధికారి ఆఫీసులో ఫిర్యాదు చేయుటకు నమూనా

దరకాస్తుదారుని వివరాలు:
విద్యుత్ వినియోగ సర్వీసు నెం. …..
పేరు: ……..
చిరునామ:……
ఫోన్ (ఉన్న పక్షంలో) కార్యాలయం:……
ఫ్యాక్స్:…… ఇ-మేల్: ……

నా విద్యుత్ కనెక్షన్ కు సంబంధించి దిగువ పేర్కొన్న సమస్యలు ఉన్నవి.
(దయచేసి సంబంధిత సమస్యకు ఎదురుగా (టిక్) మార్కు చేయండి)
బిల్లింగ్
1. తప్పుడు మీటరు రీడింగ్ నమోదు …….
2. తప్పుడు బిల్లింగ్ …….
3. బకాయి వివాదాలు …….
4. అదనపు చార్జీ/సర్ చార్జీ వివాదం …….
5. పాత బిల్లింగ్ వివాదాలు …….
6. డోర్ లాక్ కేసులు …….

కమర్షియల్ (వాణిజ్యపరమైన)
1. టైటిల్ బదలాయింపులో జాప్యం ……
2. కేటగిరి మార్పిడి ……
3. సర్వీసు/మీటరు షిఫ్టింగ్ ……
4. ఫేజ్ మార్పిడి ……
5.క్రొత్త కనెక్షన్ల జారి ……

మీటరు సమస్యలు:

1. మీటరు ఆగిపోవడం ……
2. మీటరు కాలిపోవడం ……
3. మీటరు కవర్ గల్లంతు ……
4. మీటరు కవర్ సీల్/మీటరు సీల్ గల్లంతు ……
5. ఇతరత్రా మీటరు లోపాలు …..

ఆపరేషన్ /మెయింటనెన్స్:
1. లో వోల్టేజీ …..
2. హై వోల్టేజీ …..
3. సర్వీసు వైరు సమస్యలు …..

ఇతరములు : (దయచేసి తేలియజేయండి)
…………………………..

మీరు ఫిర్యాదు చేయవలసిన విధానం:
సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ గారికి తపాలా ద్వారా: సంబంధిత అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గారికి వ్రాత పూర్వకముగా నిర్ణీత సమయములో మీ సమస్య పరిష్కారం గానిచో సంబంధిత డివిజనల్ ఇంజనీర్ లేదా సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్ గారికి తెలుపగలరు.

సంతకం

ఏ) పూర్తి చేసి, సంతకము చేసిన, ‘ఏ, ఫారము అప్లికేషన్; 
బి) పట్టా పత్రము కాపి మరియు మున్సిపల్ ట్యాక్స్ రసీదు ఒరిజినల్;
సి) ఇండెమ్నిటి బాండ్ (యజమాని కాని వారికి);
డి) డి.యి గారి పేరుతో తీసిన డిమాండ్ డ్రాఫ్టు (క్రొత్త కనెక్షన్ కు అనుబంధముగా);  
ఇ) వాణిజ్యమునకు, మునిసిపాలిటి నుండి పొందిన అనుమతి పత్రము;
ఎఫ్) పరిశ్రమలకు సంబంధిత అనుమతి పత్రము;
జి) వ్యవసాయ భూమి, యజమాని, ఆధారిత పట్టా కాపి/నకలు.
 
   

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగములో పెను మార్పులు జరిగి ప్రశంశనీయమైన ప్రగతి సాధించినప్పటికి, ఇంకను పలు సమస్యలు పరిష్కరించేదిశలోవున్నవి. వినియోగదారులకి సక్రమమైన సేవలందించి, సంత్రుప్తి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పాలని వుద్దేశంతో ప్రతి సబ్-డివిజనులలో వినియోగదారుల సేవా కేంద్రములు నెలకొల్పబడినవి.  కొన్ని సమస్యలు  పరిష్కరించినప్పటికి, ఇంకా కొంత అసంత్రుప్తి వున్నదని భావించవచ్చు.  వినియోగదారులకు సంత్రుప్తి కరమైన సేవలు లేవని ముందుకువచ్చి చెప్పడానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవిక ఇబ్బందులు గల్గునని తలచి చెప్పలేక యుండవచ్చును.
                       
     
అయితే కొన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి, వాస్తవిక వాడకానికి సరిపడక పోవచ్చును. ఉత్పత్తి మరియు వాడక వ్యత్యాసాన్ని క్రమబద్దీకరణ అవసరము దృష్టిలో ఉంచుకొని సంవత్సరములో అపుడప్పుడు అప్రకటిత కోతతో వినియోగదారులకు, అసంత్రుప్తికి కారణాలు కావచ్చును.  
         
అయితె వినియోగదారులే, కొంత శ్రద్ధ వహించి తమ, తమ, అధీనములో పనిచేయించుకునేదానికి, నాణ్యమైన మోటార్లు, కెపాసిటర్లు, సి.ఎఫ్.ఎల్ బల్బులు, అవసరమైన మేరకు హీటర్లు, లేక వాటి స్థానములో సోలార్ హీటర్లు, సోలార్ లైట్లు,  ఎలక్ట్రానిక్ రేగ్యులేటర్సుతో ఫ్యాన్లు, వీలున్న సూర్యరశ్మితో వెలుతురు, ఆఫీసు వేళలలో పరిమితమైన వాడకం, వీధి లైట్ల, వాడకములలో అదుపు, వ్యవసాయానికి హెచ్.వి.డి.ఎస్  ట్రాన్స్ ఫార్మర్లు,డిమాండ్ సైడ్ మనేజ్ మెంట్ వాడకము,  అక్రమ వాడకముదారులపై, సక్రమవాడకముదారులు సంఘటితంగ అదుపు చేసిన, దాదాపు కోటి ఎనభై లక్షల  వినియోగదారులు, సంవత్సరానికి వాడుకుంటున్న దాదాపు 53,000 మిలియన్ యూనిట్లు, విద్యుత్తులో 2500 మిలియన్ యూనిట్లు పొదుపు చేయగల వీలుంది. ఒక యూనిట్ పొదుపు 2 యూనిట్లు ఉత్పత్తికి సమానము, అంటే దాదాపు 5000 మిలియన్ యూనిట్లు అన్నమాట. ఇది 800 మెగా వాట్స్ ఉత్పత్తి  కేంద్రమునకు సమానము. సుమారు  1 మెగా వాట్టుకి 5 కోట్ల ఖర్చు, అవుతుంది. ఇది మన పొదుపు వలన ఆదా. దీనివలన అప్పుడప్పుడు కలిగే అసౌకర్య, అప్రకటిత కోత నుండి మనము కొంత మేరకు అంతరాయములు తగ్గించు కొనడానికి వీలుంది. అంటే మన సమస్యలకు మనమే పరిష్కారము, కొంత వరకు చేయ వచ్చును.            
                                                         
గ్రామ, పట్టణములలో, సర్వీసు వారిగ, పరిమితికి మించి ట్రాన్స్ ఫార్మరుపై అక్రమలోడు, లైన్ల దగ్గరగ చెట్లు, కొమ్మలు, నాసిరకమైన నిర్మాణ పనులు, కాలము చెల్లిన లైన్లు, లూజ్ లైన్లు, నాణ్యతలేని లైన్లు, ఇవన్నియూ, కొంత వరకు అంతరాయములకు మూలము. మనకొరకు, మనము, అనే సమాజ, సామాజిక చొరవతో ప్రజా పరిశీలక కమిటిలుగా ఏర్పడి, నెలవారిగ సమీక్షలు జరిపి, క్షేత్ర స్థాయి, విద్యుత్ అధికారులకు, తెలిపి, సమస్యలు నివారణ చర్యలు చేపట్టవచ్చును.   ఇందువలన మనకై మన వలన జరిగే అసౌకర్యము తొలగించటానికి దారి, సులభమౌతుంది. ప్రయత్నించి, ఫలితము చూడగలరు.   
         
అయితే ఇది అంత సులభతరమైన విషయము కాదు. సమాజ భాధ్యత అనుకుంటే సమస్యలు తీరుతాయి. నాడు నెహ్రూ, గాంధి, పటేల్ లాంటి మహమహులు మాకెందుకొచ్చిందిలే అనుకుంటే, నేడు మనము అనుభవిస్తున్న స్వతంత్ర ప్రజాస్వామ్యము వచ్చేదా! ఒక చిన ఉదాహరణ 2002 సం!!లో షుమారు 1262 కొట్ల రూపాయలు లోటు, 30.2% లైను నష్టాలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థను 2006 సం!!నాటికి షుమారు 291 కోట్ల రూపాయలు, మిగులుదల, మరియూ లైను నష్టాలు 20.2% తగ్గించి, మెరుగైన సేవలందించే దిశకు చేర్చిన, చైర్మన్ శ్రీమతి రేచల్ చెటర్జీ గారు అభినందనీయురాలు. ఇటువంటి మార్గదర్శి చూపిన బాటలో, గ్రామ, కాలని, పట్టణ స్థాయిలో, ప్రజా పరిశీలన సంఘాలుగా ఏర్పడి, సామాజిక సేవా తత్పరతతో, శాంతియుత మార్గములో సమస్యలను, క్షేత్ర స్థాయి ద్రుష్టికి తెచ్చి, వారితో విపులముగా తెలిపి సహకరించి పరిష్కరించుకొన్న యెడల, మనకై మనమే, అంతరాయములను తగ్గించుకొన్నవారమైతాము.
  
 

నిత్య అవసరాలకు సాధారణ జీవనశైలికి, అభివృద్దికి, విద్యుత్ కీలకమైనది. వినియోగదారులందరు నిరంతర, నాణ్యమైన విద్యుత్ ను కోరుకుంటారు.  

ప్రాధమిక ఆరోగ్య పరిరక్షణకు, వ్యవసాయమునకు, పరిశ్రమలకు, వాణిజ్యమునకు, గృహములకు, విధ్యాబోధనకు, కమ్యునికేషన్ కు, రవాణా సౌకర్యములకు, విద్యుత్ అవసరము.  

సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి, గ్రామ స్థాయి నుండి పునాది అవసరము. వ్యాధి నిరోధక సూత్రాలు, విద్య వలన ప్రయోజనాలు, జల, విద్యుత్,పొదుపు విధానాలు, నాణ్యమైన నిర్మాణాల వలన ప్రజా ప్రయోజనాలు, పౌర సరఫరా, పంపిణి విధి విధానాలు, లోటు పాట్లను, వివరించి తెలియజేయు ప్రజా పరిశీలక సంఘాల వలన, దేశ అభివృద్ది మెరుగు పడడానికి రాజబాట.               
            
కొంచెం శ్రద్ధ కూడ పెద్ద సమస్యలను నిలువరించే దానికి వీలు కలుగుతుంది. గ్రామాల్లో ఆరొగ్య, విద్యుత్, విద్య, వ్యవసాయము, నీటి వనరులను పొదుపు అంశాలపై చైతన్య వంతులు చేయడానికి, మండల యంత్రాంగము ప్రతి రెండవ శని వారము, ఆది వారము, ఏదొ ఒక గ్రామము ఎంచుకొని సమస్య, పరిష్కార సమీక్షలు, ప్రజా పరిశీలనలోకి తీసుకొనిరావడము సంఘాల సమన్వయముతో చేసిన, గ్రామ అభివృద్దికి,  కారణమవుతుంది. అయితే ఇది ఆచరణ యోగ్యము పరచడానికి కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పని. యూనివర్సిటిలో ప్రాజెక్ట్ చేయు యువతి, యువకులకు లేక గ్రామ, కాలని, పట్టణ, యువతి, యువకులకు  5 గురికి తక్కువ కాకుండా సంబంధిత అధికార యంత్రాంగము ద్వారా ఎంపిక చేసి, సరియైన ప్రొత్సాహకము,  భృతి ఇచ్చి, ఎన్నిక కాబడిన గ్రామ/కాలని/పట్టణములలో, ఆరొగ్య, విద్య,  వ్యవసాయము మౌలిక సదుపాయములు, విద్యుత్ సరఫరా లోటు, పాట్లను, మంచి నీరు, గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, వినియోగదారులను చైతన్య పరిచి, గ్రామాభివృద్ది, దేశ, దిశ, నిర్ణయాలను క్షేత్ర స్థాయి అధికారులకు ప్రతి నెల తెలియ పరుస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్త పరుస్తున్న  యడల అభివృద్దికి అదే రాజ బాట.నిరుద్యోగ సమస్యలు, అసంత్రుప్తి తగ్గే అవకాశమున్నది.                    

శుభాకాంక్షలు

విద్యుత్ వినియోగదారులందరికి దశరా శుభాకాంక్షలు